నడివీధి గంగమ్మకు అమావాస్య పూజలు

CTR: పుంగనూరు టౌన్ చింతల వీధిలో వెలసిన నడివీధి గంగమ్మకు అమావాస్య సందర్భంగా బుధవారం ఘనంగా పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అమ్మవారి మూలవర్లను కుంకుమ, విభూదిలతో పాటు బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించి అర్చకులు పూజలు నిర్వహించారు.