మంత్రి నాదెండ్లకు జనసేన నేతలు స్వాగతం

KKD: మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాత్రి కాకినాడ చేరుకున్నారు. ఆయనకు జనసేన పార్టీ కాకినాడ రూరల్ సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. వారు మంత్రికి బుద్ధుని విగ్రహాన్ని బహూకరించారు. రూరల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యే నానాజీ కృషిని వివరించారు.