VIDEO: మాగుంట లేఔట్‌లో చిక్కుకుపోయిన కారు
NLR: దిత్వా తుఫాను నెల్లూరు జిల్లాలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నెల్లూరులోని మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరడంతో ఒక కారు అందులో చిక్కుకుపోయింది. దీంతో కారులోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. అక్కడే ఉన్న ప్రయాణికులు, కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి, కారును బయటకు తీసేందుకు చర్యలు తీసుకున్నారు.