వంతెన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

వంతెన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

పల్నాడు: వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతను సమీక్షించిన ఆయన, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను నివారించేందుకు వంతెనను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జీడీసీసీ చైర్మన్ మల్లికార్జున ఉన్నారు.