VIDEO: మంత్రాలయం భూ సమస్యలపై సబ్ కలెక్టర్ ఆరా

VIDEO: మంత్రాలయం భూ సమస్యలపై సబ్ కలెక్టర్ ఆరా

KRNL: మంత్రాలయం భూ సమస్యలపై ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ఆరా తీశారు. చెట్నేహళ్లిలోని శ్మశానవాటిక ఆక్రమణ సమస్యతోపాటు స్థానిక రైతుల అనుభవంలో ఉన్న భూములు, రైతులకు-శ్రీ మఠం యాజమాన్యానికి భూముల విషయంలో జరుగుతున్న వివాదంపై ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యల గురించి ఎమ్ఆర్‌వో రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ మఠం రికార్డులను తనిఖీ చేయాలని సూచించారు.