VIDEO: 'కుల వృత్తులను ప్రోత్సహించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్'

VIDEO: 'కుల వృత్తులను ప్రోత్సహించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్'

ADB: కుల వృత్తులను ప్రోత్సహించి యాదవులకు గొర్లను పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని యాదవ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి హాజరయ్యారు. చిన్నారులతో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించిన అనంతరం నృత్య కళాకారులకు మెమోంటోస్ ప్రదానం చేశారు.