సీఎం, డిప్యూటీ సీఎంలపై డీఎస్పీ ఫిర్యాదు

సీఎం, డిప్యూటీ సీఎంలపై డీఎస్పీ ఫిర్యాదు

GNTR: తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి మాటల వల్ల తన మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉండి ఇలా మాట్లాడిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.