'కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'
WGL: గ్రామపంచాయతీల్లో పరిశుద్ధ పనులు సహా అనేక సేవలు అందిస్తున్న మల్టీపర్పస్ కార్మికుల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా నాయకుడు కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లబెల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తక్కువ వేతనాలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని,పెండింగ్ ఉన్న వేతనాలు విడుదల చేయాలని అధికారులను కోరారు.