ఓటు వేసేందుకు విదేశాల నుంచి..!
VKB: స్థానిక ఎన్నికల నేపథ్యంలో విద్యావంతులు తమ ఓటును వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. బండవెల్కిచర్లకు చెందిన నవీన్ కుమార్ ఐర్లాండ్ నుంచి ఓటు వేసేందుకు గ్రామానికి వచ్చి తన హక్కును వినియోగించుకున్నాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇలాంటి వారు విదేశీ, వలస వాసులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు.