ఎడారిలో రష్యా దంపతుల దారుణ హత్య
దుబాయ్ ఎడారిలో రష్యా దేశానికి చెందిన దంపతులను దారుణంగా హత్య చేశారు. మృతులు రష్యన్ క్రిఫ్టో వ్యాపారి రోమన్ నోవక్, అతని భార్య అన్నా నోవాక్‌గా గుర్తించారు. మృతుల శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికిన స్థితిలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.