VIDEO: అనపర్తిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

E.G: భారతదేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలంటూ ప్రధాని మోదీ పిలుపు మేరకు అనపర్తిలో సోమవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పాల్గొని అనపర్తి కెనాల్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం నుంచి మెయిన్ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలు పట్టుకొని విద్యార్థులు, గ్రామస్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు.