ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు
BDK: మణుగూరు పట్టణంలో అంబేద్కర్ సెంటర్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం ఉదయం రెవెన్యూ, పోలీస్ క్లూ బృందం, ప్రత్యేక ఎన్నికల స్క్వాడ్ అధికారుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలను చేపడుతున్నారు. 24 గంటలు వాహన తనిఖీలు కొనసాగుతాయని అక్రమ నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి చేపట్టామని అధికారులు తెలిపారు.