'సాంకేతికతతోనే మహిళా సాధికారత సాధ్యం'

'సాంకేతికతతోనే మహిళా సాధికారత సాధ్యం'

VZM: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న వీవోఏ (గ్రామ సంఘ సహాయకులు) సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్.కోటలోని వెలుగు సమాఖ్య భవనంలో ఐదు మండలాలకు చెందిన వీవోఏలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేశారు. విధి నిర్వహణలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.