సైబర్ నేరగాళ్ల వలలో విశ్రాంత ఉద్యోగి

సైబర్ నేరగాళ్ల వలలో విశ్రాంత ఉద్యోగి

NTR: విజయవాడలో సైబర్ నేరగాళ్లు ఒక విశ్రాంత ఉద్యోగిని మోసం చేసి రూ.1.82 కోట్లు కాజేశారు. 'ఎస్ 6 యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్' పేరుతో ఫేస్బుక్‌లో ప్రకటన చూసి, వాట్సాప్ గ్రూప్లో చేరిన బాధితుడు, ఆకర్షణీయమైన ఆదాయం ఆశతో పలు విడతల్లో రూ.1.82 కోట్లు పెట్టుబడి పెట్టాడు. డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేశాడు.