పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
KKD: గండేపల్లి మండలం నీలాద్రి రావుపేట శివారున రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 5,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.