బక్రీద్ పండుగపై పీస్ మీటింగ్

BDK: జిల్లాలో జూన్ 7న జరగనున్న బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు మంగళవారం జిల్లా ముస్లిం మతపెద్దలతో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పీస్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.