కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న ఎంపీ

కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న ఎంపీ

MBNR: జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ కృష్ణ మందిరంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలలో ఎంపీ డీకే అరుణ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షించినట్టు వెల్లడించారు.