VIDEO: కార్తీక శోభ సంతరించుకున్న శివాలయాలు..
NLG: దేవరకొండలోని నందీశ్వర్ నగర్ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు.