ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
PPM: భారత దేశ మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. మాధవ్ రెడ్ది హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.