షటర్లు ఏర్పాటుకు నిధులు మంజూరు
AKP: కోటవురట్ల మండలం పాములవాకలో నూకాలమ్మ చెరువు మదుములకు రెండు షటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇరిగేషన్ శాఖ ఏఈ రాజేష్ తెలిపారు. శనివారం గ్రామంలో చెరువును పరిశీలించారు. షటర్లు లేకపోవడంతో నీరు వృధాగా పోతుందన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత సిఫార్సు మేరకు రూ.2.35 లక్షలు నిధులు మంజూరైనట్లు పీఏసీఎస్ ఛైర్మన్ వేచలపు జనార్ధన్ తెలిపారు.