చిత్తూరులో 24 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

CTR: చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 24 మందిని అరెస్టు చేసినట్లు గురువారం టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. ఇందులో భాగంగా వారి వద్ద నుంచి 6 పేకాట కార్డు ప్యాకెట్లను, రూ.37,160 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎవరైనా చట్ట విరుద్ధ కార్య కలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.