VIDEO: ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు ఇవే..!
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 14 నుంచి 18 వరకు వరుసగా ఐదు రోజుల సెలవులు ప్రకటించినట్లు ఇవాళ కార్యదర్శి మల్లేశం తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా మార్కెట్ బంద్ ఉంటుందని, ఈ నెల 19 నుంచి క్రయవిక్రయాలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ రోజుల్లో పంటలను మార్కెట్‌కు తీసుకురావద్దని సూచించారు.