పశువుల నీటి తొట్లు నిరుపయోగం
NLG: వేసవిలో పశువుల దాహం తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్లు చెత్తాచెదారంతో నిరుపయోగంగా మారాయి. నల్గొండ నియోజకవర్గంలో దాదాపు 200 తొట్లు ఉండగా, సరైన నిర్వహణ లేక సుమారు 110 వరకు మరమ్మతులకు గురయ్యాయి. గ్రామ పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులతో వెంటనే వీటిని బాగు చేసి మూగజీవాల దప్పిక తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.