నాయిబ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ఎన్నిక

నాయిబ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ఎన్నిక

KNR: శంకరపట్నం మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన నాయీబ్రాహ్మణ సేవా సంఘం సమావేశంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. మండల ఎన్నికల నిర్వహణ కోసం 5 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. సభ్యులుగా నారాయణ, కుమారస్వామి, నర్సయ్య, సంపత్, సమ్మయ్యలను ఎంపిక చేశారు. అన్ని గ్రామాల్లో సభ్యత్వం నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.