వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
WGL: వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో కలెక్టర్ సత్య శారదాదేవి, GWMC కమిషనర్ చాహత్ బాజ్ పేయ్‌లు గురువారం పర్యటించారు. కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు పడడంతో వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురకాలనీలు నీట మునిగాయి. ఈ ప్రాంతాలను వారు పరిశీలించి, స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరారు.