మధిరకు ఈ నెల 10న డిప్యూటీ సీఎం రాక

KMM: మధిర మండలంలో ఈనెల 10న Dy. CM మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా Dy. CM వంగవీడులో రూ.600 కోట్లతో నిర్మించే జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.