ధర్మస్థల శానిటరీ వర్కర్ ఫేస్ రివీల్

ధర్మస్థలి కేసులో శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అసత్యాలని తేలడంతో అతడిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతని ఫేస్‌ను రివీల్ చేశారు. విచారణలో భాగంగా ఇన్నాళ్లు అతడికి మాస్క్ వేసి ధర్మస్థలి ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. కానీ అక్కడ ఎలాంటి మానవ అవశేషాలు దొరకకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఫేస్ రివీల్ చేయడంతో అతడికి చెందిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.