ఆనాటి ఉద్యమం ఊపిరి పోసుకుంది: TDP
ప్రకాశం: ప్రతి ఒక్కరి సహకారంతో ఆనాటి ఉద్యమం నేడు మార్కాపురం జిల్లాగా ఊపిరి పోసుకుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. అప్పటి ముఖ్యమంత్రిని జిల్లా ఉద్యమం కదిలించలేదు కానీ ప్రతిపక్షంలో వున్న చంద్రబాబును కదిలించిందన్నారు. చంద్రబాబు బర్త్డే నాడు ఇచ్చిన వాగ్దానాన్ని నేడు నెరవేర్చారని ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారన్నారు.