VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వరునికి ఘనంగా మేలుకొలుపు సేవ
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారికి పాల్గుణ మాసం శుద్ధ చతుర్దశి సోమవారం ఉదయం ఘనంగా మేలుకొలుపు సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేక పూలతో, గరిక తో అలంకరించారు. వేకువ జాము నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.