అమెరికాకు పోస్టల్ సర్వీసులను నిలిపివేసిన భారత్

అమెరికాకు అన్ని పోస్టల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ వెల్లడించింది. ఈ నెల 25 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇటీవల అమెరికా విధించిన సుంకాల కారణంగా అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుందని తెలిపింది. దీని ద్వారా పోస్టర్ సర్వీసులపై అధిక భారం పడుతున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.