'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలి'

MDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు.