VIDEO: భవనం పైకెక్కిన యువతి.. కాపాడిన యువకుడు
గుంటూరు: అరండల్‌పేట 11/1 అడ్డరోడ్డులో ఓ యువతి భవనం పైకెక్కి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను చాకచక్యంగా మాటల్లో పెట్టారు. అదే సమయంలో గోపి అనే స్థానిక యువకుడు భవనం పైకెక్కి, వేగంగా వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆ యువతిని సురక్షితంగా కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.