నేడు తిరుపతమ్మ, గోపయ్యస్వామి కల్యాణోత్సవం

నేడు తిరుపతమ్మ, గోపయ్యస్వామి కల్యాణోత్సవం

SRPT: మోతె మండల కేంద్రంలోని తిరుపతమ్మగోపయ్య స్వామి ఆలయంలో సోమవారం ఉదయం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం జరుగుతుందని చెప్పారు. మంగళవారం అమ్మవారికి బోనాలు, ప్రభబండ్లతో ఊరేగింపు, జాతర జరుగుతుందని, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.