24 గంటల్లోనే చైన్ స్నాచర్ పట్టివేత
కర్నూలులో రేషన్ షాపు నుంచి ఇంటికి వెళ్తున్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు దోచుకున్న కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జయరాంనగర్‌కు చెందిన దేవమ్మపై దాడి చేసిన నిందితురాలిని త్రీటౌన్ సీఐ శేషయ్య బృందం మంగళవారం అరెస్ట్ చేసింది. ఆమె వద్ద నుంచి తులం బంగారు గొలుసు, కత్తి, కత్తెర, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.