డీఎంకే-కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్?
తమిళనాడు సీఎం స్టాలిన్‌ను 'బ్రదర్' అని పిలిచే రాహుల్ గాంధీ, ఈసారి కేవలం 'తమిళనాడు సీఎం' అని సంబోదిస్తూ పుట్టినరోజు(MAR 1) శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశమైంది. సీట్ల సర్దుబాటు, అధికారంలో భాగస్వామ్యంపై డీఎంకే మొండివైఖరి పట్ల రాహుల్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఈసారి ఆత్మీయత కనిపించలేదని, ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.