పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ
VZM: ఈనెల 21 నుంచి 25 వరకు రామభద్రపురంలో జరిగే చిన్నమ్మతల్లి పండగ నేపథ్యంలో బొబ్బిలి గ్రామీణ సీఐ ఎస్.శ్రీనివాస్, స్థానిక ఎస్సై ప్రసాదరావు గ్రామస్థులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. పండగను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండగ పేరుతో ఎటువంటి అల్లర్లకు తావివ్వకూడదని కోరారు. వేడుకుల నేపథ్యంలో అశ్లీల నృత్యాలు చేయకూడదని నిర్వాహకులకు సూచించారు.