కులాంతర వివాహం.. యువతి ఆత్మహత్య
NDL: మహానందిలో వేర్వేరు కులాలకు చెందిన శివప్రసాద్, స్వప్న మూడేళ్లుగా ప్రేమించుకుని పెద్దలు ఒప్పుకోకపోవడంతో పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, అబ్బాయి తల్లి ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. ఈ విషయం తెలుసుకున్న స్వప్న మహానంది శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.