'యూరియా సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకోవాలి'

SRD: యూరియా సరిహద్దులు దాటకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార సంఘాల వద్ద ఎరువుల నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు.