పది నెలలకే కూటమిపై వ్యతిరేకత

పది నెలలకే కూటమిపై వ్యతిరేకత

ప్రకాశం: కొనకనమిట్ల మండలం వెలుగొండ వెంకటేశ్వరస్వామివారి జాతరకు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ గురించి మాట్లాడారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో కేసులు, అరాచకాలు తప్ప ప్రజాపాలన జరగటం లేదన్నారు. ప్రభుత్వ ఏర్పడిన పది నెలలకే వ్యతిరేకత మొదలైందని ఆరోపించారు.