కలెక్టరేట్‌లో ప్రపంచ దోమల దినోత్సవం

కలెక్టరేట్‌లో ప్రపంచ దోమల దినోత్సవం

W.G: భీమవరం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా వైద్య శాఖాధికారిణి డా. జి.గీతాబాయి మలేరియా, డెంగ్యూ, (NVBDCP) గోడ పత్రికలు ఆవిష్కరించారు. 'ఫ్రై డే-డ్రై డే' కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.