VIDEO: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్సై మృతి
MDCL: పేట్ బషీరాబాద్ PS పరిధిలో ఏఎస్సైగా పనిచేస్తున్న దేవిసింగ్ శనివారం వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ సమీపంలోని PSR గార్డెన్‌లోని గ్రౌండ్‌లో నడుస్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్యాంకర్ ఢీ కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.