VIDEO: ట్రంప్ సుంకాలపై సీపీఐ ఆందోళన

VSP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువుల దిగుమతిపై 50% సుంకాలు విధించడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ సుంకాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీ.మణి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. రెహమాన్ డిమాండ్ చేశారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.