VIDEO: అక్రమ రొయ్యల చెరువులు తవ్వకాలపై రైతులు ఆవేదన
కోనసీమ: కాట్రేనికోన మండలం దొంతికుర్రులో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాల వల్ల తమ వరి పొలాలు పాడవుతున్నాయని రైతులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించంలేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతులు మాట్లాడుతూ.. తక్షణమే తవ్వకాలు ఆపకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.