గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే శ్రావణ్

GNTR: తాడికొండ గ్రామంలో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రామంలో తిరుగుతూ గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి స్థానిక అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.