ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం: ఆనందరావు

ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం: ఆనందరావు

కోనసీమ: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఇవాళ ఆయన కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి 49 అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.