అన్ని వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయం: ఎమ్మెల్యే
ASF: అన్ని సామాజిక వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. వెడ్మ రాము 38వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ఆమె కన్నపల్లి గ్రామ పంచాయతీలో గల పెరిక సంఘ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగిందని అన్నారు.