రోజుకు 2 గంటలే నిద్రపోతా: ప్రధాని
జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రోజూ రాత్రి కేవలం రెండు గంటలే నిద్రపోతానని, ఎక్కువ అనుకుంటే నాలుగు గంటలు నిద్రపోతానని చెప్పారు. ఇటీవల ఆమె.. తెల్లవారుజామున 3 గంటలకు తన కార్యాలయంలో ఉద్యోగులతో భేటీ అవ్వడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.