ఉపాధి హామీ కూలీకి పాము కాటు

ఉపాధి హామీ కూలీకి పాము కాటు

NRML: నర్సాపూర్ (జి) మండలం టెంబుర్ని గ్రామానికి చెందిన కిష్టారెడ్డి గురువారం ఉపాధి హామీ పనులకు వెళ్లగా పాము కాటుకు గురయ్యారు. తోటి కూలీలు వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సాయికిరణ్, సృజన్ హుటాహుటిన చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.