క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సర్వే

NGKL: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశానుసారం ఈనెల 28నుండి వచ్చే నెల 2వరకు గ్రామాలలో ఇంటింటికివెళ్లి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వివరాలు సేకరించనున్నట్లు బిజినేపల్లి మండలం లట్టుపల్లి PHC వైద్యాధికారిని ప్రసన్న తెలిపారు. మహిళ ఆరోగ్యకార్యకర్తలు, ఆశావర్కర్లతో ఆదివారం సమావేశం జరిగింది. సర్వేకు వచ్చిన వైద్యసిబ్బందికి క్యాన్సర్ రోగులు సహకరించాలని ఆమె సూచించారు.