తాడేపల్లి రైల్వే గేటు మూసివేత

GNTR: తాడేపల్లి పరిధిలోని రైల్వే గేటును అత్యవసర రోడ్డు మరమ్మతుల కోసం మంగళవారం సాయంత్రం నుంచి వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు. వాహనాల రాకపోకలను సెప్టెంబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరిగి అనుమతిస్తామన్నారు. ఈ మరమ్మతుల వల్ల రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని అధికారులు తెలిపారు.